- సర్వ జనులకు శాంతి,స్వస్తి, సంపద, శ్రాంతి నే కోరు విక్రాంతి ఓ కూనల్లమ్మ
- ఈ పదమ్ములకు క్లుప్తి ఇచ్చింది సంత్రుప్తి చేయనిమ్ము సమాప్తి ఓ కూనల్లమ్మ
- సామ్యవాద పధమ్ము సౌమ్యమైన విధమ్ము సకల సౌఖ్య ప్రదమ్ము ఓ కూనల్లమ్మ
- తెలివితేటల తాడు తెంపుకొను మొనగాడు అతివాద కాంమ్రేడు ఓ కూనల్లమ్మ
- అరుణ బింబము రీతి అమర నెహ్రూ నీతి ఆరిపోవని జ్యోతి ఓ కూనలమ్మ
- ఇజము నెరిగిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగును కీడు ఓ కూనలమ్మ
- మద్య తరగతి గేస్తు మంచి బందోబస్తు జనులకిక శుభ మస్తు ఓ కూనలమ్మ
- దహనకాండల కొరివి తగలబెట్టును తెలివి కాదు కాదిక అలవి ఓ కూనలమ్మ
- కూరుచుండిన కొమ్మ కొట్టుకొను వాజ్జమ్మ హితము వినడు కదమ్మ ఓ కూనలమ్మ
- కష్ట జీవుల కొంప కాల్చి బూడిద నింప తెగునులే తన దుంప ఓ కూనలమ్మ
- జనుల ప్రేముడి సొమ్ము క్షణము లోపల దుమ్ము తులువ చేయును సుమ్ము ఓ కూనలమ్మ
- మదువు మైకమునిచ్చు వదువు లాహిరి తెచ్చు పదవి కైపే హెచ్చు ఓ కూనలమ్మ
- హరుడు అధికుడు కాడు నరుడు అల్పుడు కాడు తమకు తామే ఈడు ఓ కూనలమ్మ
- సుదతి పాలిట భర్త మొదట వలపుల హర్త పిదప కర్మకు కర్త ఓ కూనలమ్మ
- చివరి ప్రాసల నాభి చిత్రమైన పఠాభి కావ్య సుధట షరాభి ఓ కూనలమ్మ
- తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును హాయి అప్పు మెడలో రాయి ఓ కూనలమ్మ
- నిజము నిలువని నీడ నీతి యన్నది చూడ గాజు మెంకుల గోడ ఓ కూనలమ్మ
- చెప్పి దేవుని పేరు చెడుపు చేసెడి వారు ఏల సుఖ పడతారు ఓ కూనలమ్మ
- ఈశుడంతతి వాడు ఇల్లరికమున్నాడు పెండ్లయిన మరునాడు ఓ కూనలమ్మ
- జనులు గొర్రెల మంద జగతి వేసెడు నింద జమకట్టు స్తుతి క్రింద ఓ కూనలమ్మ
Friday, 9 September 2016
Arudra - Koonalamma padalu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment